Ticker

6/recent/ticker-posts

Ad Code

BRS (బీఆర్‌ఎస్‌) తర్వాత కొత్త సమస్యలు


హైదరాబాద్‌, డిసెంబర్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : బీఆర్‌ఎస్‌ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటన వాయిదా పడింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చిన తర్వాత కేసీఆర్‌ చుట్టూ సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ఆయన జాతీయ పార్టీ విస్తరణపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టలేకపోతున్నట్టు తెలిసింది. బీజేపీకి బీఆర్‌ఎస్‌ పార్టీనే ప్రత్యామ్నయం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు ముందుగా రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేసేందుకు పావులు కదిపారు. అందులో భాగంగా ఫామ్‌ హౌజ్‌ కేసులో బీజేపీ సెంట్రల్‌ లీడర్లను కోర్టు మెట్లు ఎక్కించేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారు. అందుకోసం కోట్లు ఖర్చు పెట్టి ఢల్లీి నుంచి పెద్ద పెద్ద లాయర్లను పిలిచి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. కానీ ఊహించని తీరుగా కోర్టు సిట్‌ దర్యాప్తు నిస్పక్షపాతంగా లేదని అంక్షితలు వేస్తూ, సిట్‌ను రద్దు చేసింది. అంతకుముందు ఢల్లీి లిక్కర్‌ కేసులో కూతురు ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారించేందుకు సీబీఐ నోటీసు ఇవ్వడంతో షాక్‌ గురయ్యారు. ఆ నోటీసును ఎలా ఎదుర్కోవాలో ప్రగతిభవన్‌ లో గంటలకొద్ది న్యాయనిపుణలతో సలహాలు తీసుకున్నారు. వారంతా సీబీఐ విచారణకు వెళ్లకతప్పదని సలహాలు ఇవ్వడంతో కవిత సీబీఐ విచారణకు వెళ్లారు. ఆ తర్వాత వారం రోజులకు ఇదే కేసులో ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో కవిత పేరును ప్రస్తావిచండంతో ఏం జరగబోతుందనే ఆందోళన నెలకొన్నది. ప్రతికూల పరిస్థితులు ఎదురవడమే అందుకు కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. 


ఓ వైపు సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు అంక్షింతలు, మరోవైపు ఢల్లీి లిక్కర్‌ కేసులో ఈడీ దర్యాప్తు స్పీడ్‌ అందుకున్నది. ఇంకోవైపు పార్టీలో గ్రూపు తగాదాలు ఊపందుకున్నాయి. దీంతో కేసీఆర్‌ జాతీయ పార్టీ విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేకులు వేసినట్టు చర్చ జరుగుతున్నది. నిజానికి క్రిస్మస్‌ తర్వాత జాతీయ పార్టీ విస్తరణ కోసం కేసీఆర్‌ పలు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. కానీ ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ఆ పర్యటనలను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.ఢల్లీిలో జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్‌ పూర్తిగా జాతీయ పార్టీ విస్తరణపై ఫోకస్‌ పెడుతారని లీకులు ఇచ్చారు. క్రిస్మస్‌ తర్వాత పలు రాష్ట్రాల్లో ఆయన స్వయంగా పర్యటించి, పార్టీ విస్తరణ కోసం ఆయా రాష్ట్రాల లీడర్లతో సమావేశం అవుతారని పేర్కొన్నారు. కానీ, ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ప్రస్తుతానికి రాష్ట్ర పర్యటనలకు బ్రేకులు పడ్డాయి. అంత అనుకున్నట్టు జరిగితే సీఎం కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనలు సంక్రాంతి తర్వాత ఉంటాయని ప్రగతిభవన్‌కు దగ్గరగా ఉండే ఓ లీడర్‌ వివరించారు.అసెంబ్లీ ఎన్నికలకు కేవలం పది నెలల సమయం మాత్రమే ఉన్నది. దీంతో ఇంతకాలం పార్టీలో ఎన్ని విబేధాలు ఉన్నా లీడర్లంతా మౌనంగా ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించకపోతే తమ ఉనికికే ప్రమాదమని గ్రహించారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని బయటికి వెళ్లగక్కుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయన్ను కేబినెట్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుతో విసిగిపోయి తాడోపేడో తేల్చుకునే పనిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా పార్టీలో చాలా కాలంగా ఉన్న విబేధాలు త్వరలో బహిర్గతమయ్యే చాన్స్‌ ఉన్నది. రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోతే తన సత్తా ఏంటో చూపుతానని మాజీ మంత్రి తుమ్మల రెడీ అయినట్టు ఆ జిల్లా గులాబీ లీడర్లు చెపుతున్నారు. 


వరంగల్‌ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, కడియం మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటిని కంట్రోల్‌ చేయడంలో ప్రగతిభవన్‌ చేతులు ఎత్తిసినట్టు తెలిసింది. మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ వర్గీయుల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆ పార్టీ బలం పెంచుకునే ప్రమాదం ఉన్నదనే ఆందోళన నెలకొన్నది. ఎలాగైనా బాబును తెలంగాణలోకి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ చక్రం తిప్పే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఏపీలో ఉన్న టీడీపీ లీడర్లను జగన్‌ పార్టీలోకి వెళ్లాలని, లేకపోతే హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారాలకు సమస్యలు తప్పవనే హెచ్చరికలు పంపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు