Ticker

6/recent/ticker-posts

Ad Code

న్యూ ఇయర్‌ నుంచి కమలం పక్కా ప్లాన్‌


హైదరాబాద్‌, డిసెంబర్‌ 31, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం బిజెపి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సైన్యాన్ని సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీజేపీనే అని చూపించే ప్రయత్నం చేస్తున్న నాయకులు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకారు. మొత్తం వచ్చే ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలను టార్గెట్‌ చేసుకొని మిషన్‌ 90 కార్యాచరణ ప్రణాళికకు తాజాగా జరిగిన సమావేశంలో ఆమోద ముద్ర పడిరది.రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీకి బలమైన నాయకులు ఉన్నారని అంచనాకు వచ్చిన బిజెపి జాతీయ నాయకత్వం మిగతా 40 చోట్ల గెలవగలిగే అభ్యర్థులను అన్వేషించాలని, ప్రత్యర్థి పార్టీలలో ఉన్న బలమైన నాయకులను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగించాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ప్రభారీ, కన్వీనర్‌, పాలక్‌, విస్తారక్‌ లను నియమించి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్షన్‌ క్యాలెండర్‌ అమలుపై దిశానిర్దేశం చేశారు.మిషన్‌ 90 లోగోను బీఎల్‌ సంతోష్‌ తో పాటు జాతీయ నాయకులు, రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అమలు చేయాల్సిన అనేక ముఖ్యమైన సూచనలు చేశారు. అసెంబ్లీ స్థానాల వారీగా బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేసుకున్నామని చెప్పిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్ర నాయకుల మార్గదర్శకత్వం, సూచనలతో పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుందన్నారు.


బీజేపీ మిషన్‌ 90 లో కచ్చితంగా 90 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు.పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయించడం కోసం విస్తారక్‌ లను ఏర్పాటు చేసిన బిజెపి అధినాయకత్వం, విస్తారక్‌ లు నియోజక వర్గానికి చెందిన వారు కాకుండా ఆయా ప్రాంతాలకు చెందిన వారికి బాధ్యతను అప్పగించి తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. కన్వీనర్లుగా స్థానికులకు అవకాశం కల్పించిన బీజేపీ నెలలో కనీసం 20 రోజులు పార్టీకి పూర్తి సమయం ఇచ్చి కన్వీనర్లు కేటాయించిన ప్రాంతంలోనే ఉండాలి. ఇక ప్రభారీ లు గా నియమించిన వారు నెలకు కనీసం పది రోజులు ఆ నియోజకవర్గాలలో పని చేయాలి. పార్టీ అప్పగించిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇక అన్నిటికంటే పాలక్‌ లు వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకోవాలి. రాజకీయ సలహాలు ఇవ్వడంతోపాటు, నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలను, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి నిర్వహించే కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ఇలా ఎన్నికల టీం ను నియమించుకొని బి జె పి సమరానికి సిద్ధమైంది. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం పైన, నియోజకవర్గాలలో కార్నర్‌ విూటింగ్లు పెట్టడం పైన, బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయడం పైన దృష్టిసారించి క్షేత్రస్థాయిలో పని చేయనుంది. వచ్చే ఎన్నికలకు బిజెపి దండు రెడీ అయింది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా కార్యక్షేత్రం లో ముందుకు వెళ్లనుంది బిజెపి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు