Ticker

6/recent/ticker-posts

Ad Code

ప్రధాని మోడీ తల్లి కన్నుమూత


అహ్మదాబాద్‌, డిసెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాన నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌  ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్‌ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. తన తల్లి ఫొటోను షేర్‌ చేస్తూ.. నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల అనారోగ్యానికి గురైన హీరాబెన్ను.. రెండు రోజుల క్రితం అహ్మాదాబాద్లోని యూఎన్‌ మెహతా ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు గురువారం వైద్యులు వెల్లడిరచినప్పటికీ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 

హీరాబెన్‌ ప్రస్తుతం నరేంద్ర మోడీ చిన్న తమ్ముడు పంకజ్‌ మోడీ తో గాంధీ నగర్‌ జిల్లా రాయ్సన్‌ గ్రామంలో వుంటున్నారు.  గుజరాత్‌ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ నరేంద్ర మోడీ ఆమెను కలుస్తూ వుంటారు. శుక్రవారం నాడు ప్రధాని పశ్చిమ బెంగాల్‌ లో పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి వుంది.  తల్లి అంత్యక్రియలలో అయన పాల్గోన్నారు.హీరాబెన్‌ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్‌ విూడియాలో సంతాపం ప్రకటించారు.  బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్‌ విూడియాలో ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు