Ticker

6/recent/ticker-posts

Ad Code

మంచు తుఫాను బీభత్సం


అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. మంచు తుఫాను వల్ల మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. హిమ విస్ఫోటం అమెరికాను వణికిస్తోంది. మంచు తుఫాన్‌ కారణంగా అమెరికా జనజీవనం స్తంభించిపోయింది. సరస్సులో పడి గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు చనిపోవడం విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత జారిపడి సరస్సులో గల్లంతయ్యారు. అమెరికాలో ఉన్న తమ వారు ఎలా ఉన్నారో అని మన దేశంలో చాలా మంది టెన్షన్‌ పడుతున్నారు. అమెరికాలో చోటు చేసుకున్న మంచు తుఫాన్‌ ఘటనలు గతంలోను కొన్ని దేశాల్లో చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.తాజాగా, న్యూజెర్సీలోని అరిజోనాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దంపతులు మంచు తుఫాను వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఐస్‌ లేక్‌ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినా ఫలితం లేకపోయింది.. న్యూజెర్సీలో కురుస్తున్న బాంబ్‌ సైక్లోన్‌ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఓ ఐస్‌ లేక్‌లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు. గడ్డ కట్టిన ఒక భారీ ఐస్‌ క్యూబ్‌పై నిలబడి ఫోటోలు తీసుకునే క్రమంలో ఐస్‌గడ్డ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ, హరిత దంపతులు ఐస్‌ గడ్డపై నుంచి కిందపడి ఐస్‌ లేక్‌ కింది భాగంలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. రాన్‌లో 1972లో మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్‌ దాటికి ఏకంగా 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్‌ కారణంగా 26 ఫీట్ల మంచు కురిసింది. 200 గ్రామాలను పూర్తిగా మంచు కప్పేసింది. వారం రోజుల పాటు కురిసిన మంచు కారణంగా వీస్‌ కాన్‌ సిన్‌ అనే ప్రాంతం పూర్తిగా మంచులో కూరుకుపోయింది.అఫ్ఘానిస్థాన్‌లో 2008లో మంచు తుఫాన్‌ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. 2008 జనవరి 10న ప్రారంభమైన మంచు తుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతలు `30 డిగ్రీలకు పడిపోయింది. 180 సెంటివిూటర్ల మంచు కురిసింది. ఈ మంచు తుఫాన్‌ కారణంగా మొత్తం 926 మంది కన్నుమూశారు. 


చరిత్రలో మూడో అతి పెద్ద మంచు తుఫాన్‌గా ఈ విషాదం నిలిచింది. మంచు తుఫాన్‌ కారణంగా లక్ష గొర్రెలు, మేకలు చనిపోయాయి. 3,15,000 పశువులు మృత్యువాత పడ్డాయి.బాంబ్‌ సైక్లోన్‌ మాదిరే 1888లో అమెరికాలో తీవ్ర మంచు తుఫాన్‌ సంభవించింది. ఆ ఘటనలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 1900లో గాల్వెస్టన్‌ హరికేన్‌ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా నిలిచింది. తుఫాన్‌ కారణంగా సుమారు 8వేల మంది మరణించారు.1950, 1993లో అమెరికాలో సంభవించిన తుఫానుల్లో 300 మంది మృతి చెందారు. 1996లో ఏర్పడ్డ మంచు తుఫాన్‌ లో 154 మంది మృతి చెందారు. 2016లో వచ్చిన మంచు తుఫాన్‌ కారణంగా 55 మంది మరణించారు.ప్రస్తుతం అమెరికాను బాంబ్‌ సైక్లోన్‌ కలవరపెడుతోంది. కెనడాలోను దీని ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికాలో ఈ హిమోత్పాతానికి మృతుల సంఖ్య 66కు చేరింది. అతి శీతల ప్రభావంతో ఇళ్లు, రోడ్లు, హోటళ్లు అన్ని మంచులో కూరుకుపోయాయి. మంచు ప్రభావం 20 కోట్ల మందిపై ఉంటుందని అధికారులు తెలిపారు. మంచు తుఫాన్‌ పరిణామాలపై ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సవిూక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో `40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. నప్లెస్‌లో `52 డిగ్రీల చలి నమోదైంది. మియావిూలో కూడా `50 డిగ్రీల చలి రికార్డు అయింది. గంటకు 71 మైళ్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. 15లక్షల మంది విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 41 సంవత్సరాల క్రితం అమెరికాలో సర్కస్‌ తుఫాన్‌ కారణంగా 14 ఇంచుల మేర మంచు కురిసింది.ఐస్‌ లేక్‌ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయిందని సమాచారం. ఈ క్రమంలో దంపతులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌లో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు