వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7 మెడికల్ కాలేజీలకు CM - KCR ప్రారంభోత్సవం.
హైదరాబాద్ నవంబర్ 15, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. మనం ఇవాళ ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు. ‘గతంలోనే మనం ప్రభుత్వరంగంలో నాలుగు కళాశాలను స్థాపించుకున్నాం. మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో గతంలో నాలుగు ప్రారంభించాం. అవన్నీ మెడికల్ ఎడ్యూకేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఇవాళ మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రారంభించుకుంటున్నాం. మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు.
వీటన్నింటికి కారణం సొంతరాష్ట్రం ఏర్పాటుకావడం. సొంత ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరపమైంది. మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నాను. మంత్రికి పూర్తిగా సహకరించిన సీఎస్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి, ఇతర వైద్య శాఖల అధికారులు, సిబ్బంది అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్న. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావాలని మనం సంకల్పించుకున్నాం’ అన్నారు. ‘ప్రభుత్వరంగంలో వచ్చే మెడికల్ కాలేజీ సంఖ్య 17కు పెరిగింది. జిల్లాల కవరేజీ స్తే 16కు వచ్చాం. ఇంకో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలో ప్రారంభించుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో విశేష కృషి చేసి పూర్తి చేస్తాం. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం 17 కాలేజీలను ప్రారంభించుకుందాం. భగవంతుడు మన్నిస్తే నేనే వాటికి ప్రారంభోత్సవం చేస్తే. గతంలో 850 మెడికల్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉండేవి. ప్రస్తుతం ఎకాఎకీన 2,790 సీట్లకు పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు నాలుగు రెట్లు సీట్లు పెరుగడం సంతోషం. పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో పోలిస్తే గణనీయంగా పెంచుకోగలిగాం. గతంలో కేవలంలో రాష్ట్రంలో 515 పీజీ సీట్లు ఉంటే.. ఇప్పుడు 1180 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే.. ప్రస్తుతం 152 వరకు అందుబాటులోకి వచ్చాయి. సీట్ల పెంపుతో విద్యార్థులకు మంచి అవకాశం దొరుకుతున్నాయి’ అన్నారు. ‘రెసిడెన్షియల్ కళాశాలల నుంచి వస్తున్న రత్నాల్లాంటి, వజ్రాలంటి విద్యార్థులు నీట్‌లో సీట్లు సాధిస్తున్నారు.ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు బలహీన బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఇదో మంచి అవకాశం. ఇందుకు కృషి చేసిన రమేశ్‌రెడ్డికి, అధికారులకు ధన్యవాదాలు. మెడికల్ సిబ్బంది, జనాభా నిష్పత్తికి సరితూగే డాక్టర్లు ఉండడం ఎంత అవసరమో దానికి తగు రీతిలో పారామెడికల్ సిబ్బంది, రెడియాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషన్లు తదితర వైద్య సహాయక సిబ్బంది తగుమోతాదులో ఉండాలి. దాన్ని కూడా నిర్లక్ష్యం చేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సిబ్బంది నియామకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 33 జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కళాశాలలు యూనిఫాంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా పారామెడికల్ కోర్సులు అన్ని చోట్ల పెట్టకపోయినా.. వరంగల్ లాంటి ప్రముఖ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్క కోర్సు ఉండేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ఏ మారుమూల అయినా మనదే. యావత్ తెలంగాణ అభ్యుదయం జరగాలి’ అన్నారు.