Ticker

6/recent/ticker-posts

Ad Code

పులి దాడిలో రైతు మృతి

కొమురం భీమ్‌, నవంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) : కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా లో పులి దాడి లో  పంట చెనులో పని చేస్తున్న  సిడం భీం మృతి చెందాడు.  జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న పెద్దపులి దాడులు  జిల్లావాసులు భయాందోళనలో వున్నారు. అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం చౌపన్‌ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సిడాం భీము తండ్రి నారు (69) పత్తి చేనులో కాపలా ఉండే సమయంలో అకస్మాత్తుగా పెద్ద పులి దాడి చేసి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది దీంతో అక్కడికక్కడే సిడం  భీం మృతి చెందాడు... మృతునికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు గత సంవత్సరం నవంబర్‌ 11 న దిగిడలో చేపల వేటకు వెళ్లిన విఘ్నేష్‌ ను, నవంబర్‌ 29 న అదే అటవి ప్రాంతంలోని కొండపల్లి ప్రాంతంలో నిర్మల అనే యువతి పై దాడి చేసి హతం చేసిన బెబ్బులి.. రోజురోజుకు  చేను పనులకు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు మాటు వేసి చూస్తున్న పులులు ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తుందో నన్న భయంతో రైతులు  వణికి పోతున్నారు....


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు