సికింద్రాబాద్, నవంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం మెట్టుగూడ డివిజన్ పరిధిలో 32 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అధికారులు, నేతలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మెట్టుగూడ డివిజన్ ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని,దీనికి అన్ని విభాగాల అధికారులు సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్ల లో అభివృద్ధి పనుల్లో పోటీ తత్వ్వాన్ని పెంచి ఆదర్శావంతమైన డివిజన్లుగా తీర్చిదిద్దుతున్నా మని తెలిపారు. దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకై తమ క్యాంపు కార్యాలయాన్ని అందుబాటులో ఉంచుతున్నామని పద్మారావు పేర్కొన్నారు. తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర గౌడ్, కార్పోరేటర్ సునిత, BRS నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి రాజేశ్ గౌడ్ పెద్ధన్న, Dr. గంగాధర్, AR క్రిష్ణ, ఏ.ప్రకాశ్, రాజేశ్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో విజయపురి కాలని, వైట్ హౌస్, మెట్టుగూడ, చింత బావి, పాత పోస్టాఫీసు, దూద్ బావి, వైట్ హౌస్, దాదర్ కాంపౌండ్ తదితర ప్రాంతాలలో 32 లక్షల విలువజేసే చెక్కులను ఈ సందర్భంగా నేరుగా లబ్దిదారుల ఇళ్ళకే వెళ్ళి అందించారు.
ప్రజల అభివృద్ధి కై నిరంతర కృషి : పద్మారావు
శనివారం, నవంబర్ 12, 2022
0
Tags