మర్రి జంపింగ్ తో లాభం..ఎవరికి నష్టం ?
మంగళవారం, నవంబర్ 22, 2022
0
హైదరాబాద్, నవంబర్ 22, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..గట్టిగా పోరాటం చేస్తుంది..నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే అధికారంలోకి వచ్చేంత బలం బీజేపీకి లేదు..ఆ విషయం బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు..అందుకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉండే బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇటీవల ఫాంహౌస్ ఎపిసోడ్‌తో టీఆర్‌ఎస్ నేతలని లాగే విషయంలో బీజేపీ కాస్త బ్రేక్ వేసింది.కానీ కాంగ్రెస్ నేతలని మాత్రం చేర్చుకుంటూనే ఉంది..ఇదే క్రమంలో తాజాగా మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అయ్యారు. అనేక ఏళ్ళు నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తూ ఓ సీనియర్ నేతగా ఉన్న మర్రి గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రేవంత్ వల్ల కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆరోపిస్తున్నారు.ఇక ఈయన ఎప్పటినుంచో బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు..అలాగే బీజేపీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే సమయంలో మర్రిపై కాంగ్రెస్ వేటు కూడా వేసింది. ఇక మర్రి బీజేపీలో చేరిక ఖాయమైంది. సరే మర్రి బీజేపీలోకి వస్తున్నారు..దీని వల్ల బీజేపీకి ఏమన్నా బెనిఫిట్ ఉందా? అంటే పెద్దగా ఉపయోగం లేనట్లే కనిపిస్తోంది.ఒకప్పుడు అంటే మర్రికి మంచి ఫాలోయింగ్ ఉంది..సనత్‌నగర్ లాంటి స్థానంలో సత్తా చాటిన నేత. కానీ ఇప్పుడు అక్కడ బలం లేదు. ఏదో సీనియర్ నేతగా ఉండటం తప్ప..మర్రికి పెద్ద బలం లేదు. అందుకే ఆయన వెళ్లిపోతున్నా సరే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. మర్రి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం లేదు..రావడం వల్ల బీజేపీకి లాభం లేదు. అయితే బలం లేని నియోజకవర్గాల్లో బలమైన నేతలని చేర్చుకుంటేనే బీజేపీకి ప్లస్.
Tags