Ticker

6/recent/ticker-posts

Ad Code

బ్యాంక్‌ స్టేట్‌ మెంట్లతో " జరభద్రం "


నిజామాబాద్‌, నవంబబర్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : తరచూ మన మొబైల్‌ ఫోన్‌లకు, పర్సనల్‌ మెయిల్స్‌కు చిత్రవిచిత్ర మెస్సేజ్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ లింక్‌ క్లిక్‌ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని, తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి అని మెస్సేజ్‌లు వస్తుంటాయి. ఈ లింక్‌ క్లిక్‌ చేస్తే విూ ఖాతాలో లక్ష రూపాయలు జమ అవుతాయి అంటూ రకరకాల మెసేజ్‌లు రావడం తరచుగా చూస్తూనే ఉంటాం. పొరపాటున ఆ లింక్‌ లను క్లిక్‌ చేశారో విూరు బుక్కైనట్టేనని వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలా లింకులు పంపిస్తూ వాటి ద్వారా విూ ఖాతాల్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు సైబర్‌ కేటుగాళ్లు. తస్మాత్‌ జాగ్రత అంటున్నారు వరంగల్‌ పోలీసులు.. సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతే విషయాన్ని దాటిపెట్టకుండా సత్వరం పోలీసులను ఆశ్రయించాలన్నారు. 1930 నెంబర్‌ కు కాల్‌ చేయాలని సూచించారుతస్మాత్‌ జాగ్రత్త అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు అమాయకులు వారి ఉచ్చులోపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్‌ విూడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డ్స్‌, జాబ్స్‌, కవిూషన్లు, డిస్కౌంట్‌ ఆఫర్లతో సులభంగా డబ్బు సంపాదించొచ్చని జనానికి ఆశలు రేకెత్తించి.. నిలువునా ముంచుతున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను సైబర్‌ నేరగాళ్లు కాజేతున్నారు. ఈ మధ్య కాలంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇలాంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్‌ నేరస్తుల మాయలోపడి నిత్యం ఏదోచోట డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అనుమానిత యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు అని.. వాట్సాప్‌ నంబర్లకు వచ్చే మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దు అని వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ లిఫ్ట్‌ చేసి ఓటీపీ నంబర్‌, బ్యాంకు వివరాలు చెప్పొద్దని పోలీసులు చెబుతున్నా, కొందరు మాత్రం అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకుని ఇళ్లుగుల్ల చేసుకుంటున్నారు. అయితే బాధితుల్లో ఉన్నత చదువులు చదివినవారు, యువతీ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు.అవసరం ఎంత పెద్దదైనా, లోన్‌ అప్లికేషన్ల ద్వారా మాత్రం డబ్బు తీసుకోకండి. అప్లికేషన్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకునేటప్పుడు విూకు తెలియకుండానే విూ మొబైల్‌ స్టోరేజ్‌, కాంటాక్ట్‌ లొకేషన్‌ లాంటి విూకు సంబంధించిన వివరాలు ఇస్తారు. విూ వ్యక్తిగత డేటాను ఉపయోగించి, విూ పరువుకు నష్టం కలిగిస్తామని బెదిరించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తారని ట్విట్టర్‌ ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఫేక్‌ అప్లికేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ కమిషనరేట్‌ సూచించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు