Ticker

6/recent/ticker-posts

Ad Code

సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూత


హైదరాబాద్‌,నవంబర్‌ 15, (ఇయ్యాల తెలంగాణ) : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ (81)  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరుగాంచిన  ఘట్టమనేని శివరామ కృష్ణ మరణంతో కుటుంబ సభ్యులతో సహా సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.   కృష్ణ.. మంచి నటుడు, నిర్మాత, దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం.. మంచి మనసున్న వ్యక్తి.. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్‌ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు. సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూశారు.   శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న కృష్ణ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆర్ధరాత్రి  దాటిన కృష్ణ ఆరోగ్యం విషమించడంతో  హుటాహుటిన ఆయన కుమారుడు మహేశ్‌?బాబు   కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్‌? నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత వైద్యులు ప్రెస్‌?విూట్‌? పెట్టి.. కృష్ణ హెల్త్‌? బులిటెన్‌? విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏవిూ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో  ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పట్టాను అందుకున్నారు.  వెండి తెరపై నటుడిగా   ‘కొడుకులు కోడళ్ళు’ చిత్రంతో అవకాశం వచ్చినా ఆ సినిమా ఆగిపోయింది.  ‘తేనె మనసులు’ కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు శివరామ కృష్ణ. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.ఆ తరువాత ఆయన చిత్రపరిశ్రమలో రికార్డులు సృష్టించే హీరోగా ఎదిగా?. ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదల అయ్యాయి. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు  ‘సూపర్‌స్టార్‌’ అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ వంటి డిఫరెంట్‌ చిత్రాల్లో మెప్పించిన సూపర్‌ స్టార్‌. ఆయన మృతితో తెలుగుచిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.

ఒకే ఏడాది 17 సినిమాలు :



తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్‌ లేదు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 50 ఏళ్ల క్రితంమే పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో బాలీవుడ్‌ లో సత్తా చాటుతూ ఆ సినిమా కాసుల వర్షం కురిపించింది.జేమ్స్‌ బాండ్‌, కౌబాయ్‌, 70 ఎమ్‌ ఎమ్‌, ఈస్టమన్‌ కలర్‌ నుంచి రంగుల సినిమా ఇలా అనేక రకాల జోనర్లను, కొత్త సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్‌ స్టార్‌ కృష్ణగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.  సొంతం బ్యానర్‌ పద్మాలయ స్టూడియోస్‌ బ్యానర్‌ ను స్థాపించి.. అనేక సినిమాలను తెరకెక్కించారు.  భారతదేశంలోనే తొలి యాక్షన్‌ కౌబాయ్‌ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇప్పటికీ వెండి తెరపై చెరగని ముద్రేహాలీవుడ్‌ సినిమా స్టైల్‌ లో కౌబాయ్‌ సినిమాల జానర్‌ తో  కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా పద్మాలయ స్టూడియోస్‌ బ్యానర్లోనే తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే కాదు.. భారతదేశంలోనే తొలి యాక్షన్‌ కౌబాయ్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇంగ్లీష్‌, స్పానిష్‌, రష్యన్‌, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో 1971లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. రిలీజైన ప్రతి భాషలోనూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. 

సింహాసనం సినిమాతో .... 


సింహాసనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా 70 ఎమ్‌ ఎమ్‌ ని పరిచయం చేశారు.తెలుగులో తొలి జేమ్స్‌బాండ్‌ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్‌ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్‌ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్‌ స్టార్‌ కృష్ణ సినిమాలే.. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్‌ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు.నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్‌ స్టార్‌ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్‌ ఐతే వెంటనే ఆ నిర్మతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి? ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు.. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో అంటూ అప్పటి నిర్మాతలు అన్నిసార్లు అనేక సందర్భాల్లో చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు