చార్మినార్, నవంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖా వారి ఆధ్వర్యంలో చార్మినార్ పంజేషా ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ లో నో స్పాల్పెల్ వ్యాసెక్టమీ కార్యక్రమంలో భాగంగా జనాలకు అవగాహన కల్పించారు. పక్షం రోజుల ప్రత్యేక వ్యాసెక్టమీ శస్త్ర చికిత్స గురుంచి తెలియజేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శస్త్ర చికిత్స ద్వారా చేయవచ్చని ఎలాంటి ఆపరేషన్లు చేయకుండా ఇప్పుడు పురుషులకు కూడా శస్త్ర చికిత్సతో కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ లేకుండా చాలా సాధారణ పద్దతిలో శస్త్ర చికిత్స చేసుకోవచ్చని సూచించారు. ప్రతి గల్లీ ప్రాంతాలలో తిరుగుతూ చైతన్య వంతులను చేశారు. కుటుంబ నియంత్రణలో పురుషులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అపోహలు పడవద్దని దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అత్యంత సరళమైన పద్దతిలో శస్త్ర చికిత్స విధానం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో Dr. విజయలక్ష్మీ, PHN బి. పద్మ , ఏఎన్ఎం లు ఆర్. అనిత, సి. రజిత, లక్ష్మి, సరిత, ఆశ ఎ. పద్మ పంజేషా -1 చార్మినార్ ఇతర హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.