సికింద్రాబాద్, నవంబర్ 15 ( ఇయ్యాల తెలంగాణ) :1874లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణం జరిగింది. తెలంగాణలోనే ఇది అతి పెద్ద రైల్వేస్టేషన్. హైద్రాబాద్ లో 3రైల్వేస్టేషన్ లు ఉన్నాయి. రద్దీని తగ్గించడం కోసం చెర్లపల్లిలో మరొక్క టెర్మినల్ ను ప్రారంభించాం. సికింద్రాబాద్ స్టేషన్ ను అభివృద్ధి పరచడం కోసం 719 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. రైల్వేస్టేషన్ పూర్తిగా ఆదునికరించనున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. . రాబోయే 40ఏళ్ల తరువాత వచ్చే ప్రయాణికుల తాకిడిని కూడా తట్టుకునే విదంగా ఉంటుందని అన్నారు. జీ G 4 కారు పార్కింగ్ తో పాటు 24 లిఫ్టులు, ఎక్స లేటర్లు సీసీ కెమెరాల, వైఫై, అధునాతన రైల్వేస్టేషన్ గా ఇది మారనుంది.
దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్ గా దీనిని రూపొందిస్తున్నాము. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడు దశలలో పనులను పూర్తి చేయాలని అదేశాలివ్వడం జరిగింది. 36నెలలలో పనులను పుర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. 384 కోట్లతో వరంగల్ లో 150 ఎకరాలలో వర్క్ షాప్ నిర్మాణము చేపడుతున్నామని అన్నారు.