హైదరాబాద్, అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజు పూజలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ లను ఏర్పాటు చేసుకొని తమ వీధిలోనే కొలను ఏర్పాటు చేసుకొని అందులో బతుకమ్మలను వేస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ తార్నాక లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ లో చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని బతుకమ్మలను తెచ్చి ఈ కొలనులో నిమజ్జనం చేస్తున్నారు. ఈ వేడుకలో తెరాస పార్టీ నాయకులు రాజేష్ పెద్దన్న సకుటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.