చార్మినార్, సెప్టెంబర్ 28 (
ఇయ్యాల తెలంగాణ) ; శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడవరోజు అమ్మవారి అలంకరణ దేవాలయ ట్రస్టీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అలంకరణ కొనసాగింది. దేవాలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.