న్యూ ఢిల్లీ మార్చ్ 2 (ఇయ్యాల తెలంగాణ) : రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఆయన ఆంతరంగికులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఉక్రెయిన్ పైనే బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. పుతిన్ మరో ప్లాన్‌కు కూడా రంగం సిద్ధం చేసినట్లు ఆయనకు అత్యంత దగ్గరి స్నేహితుడు, బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషంకో వెల్లడించారు. లుకాషంకో కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులతో ఓ ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పుతిన్ తదుపరి లక్ష్యం ఏమిటన్నది లీక్ అయినట్లు సమాచారం. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ విరుచుకుపడేది పక్కనే వున్న మోల్దోవాపై అని ఆయన అధికారులతో అన్నారు. రష్యా` ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషంకో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఓ మ్యాపును చూపిస్తూ.. రష్యా.. ఉక్రెయిన్ను ఎలా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందో వివరించారు. ఈ సమయంలోనే ఆయన పుతిన్ తదుపరి టార్గెట్‌ను కూడా వెల్లడిరచారు. ప్రస్తుతం ఇది సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది.