రష్యా బాంబు దాడికి ఉక్రెయిన్ లో భారత విద్యార్ధి దుర్మరణం
మాస్కో, మార్చి 1, (ఇయ్యాల తెలంగాణ) : తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ ప్రభుత్వ హెడ్‌క్వార్టర్స్‌పై రష్యా సేనలు వైమానిక దాడి జరిపాయి. అటు నివాస ప్రాంతాలపైనా జరిగిన దాడుల్లో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది.ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాతో జత కలిసే ఆలోచన తమకు లేదని బెలారస్ స్పష్టంచేసింది. రష్యా సేనలకు బెలారస్ సేనలు సహకరిస్తున్నట్లు ఉక్రెయిన్ పాలకులు ఆరోపిస్తున్నారు. బెలారస్ భూభాగం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పష్టంచేశారు. రష్యాతో కలిసి తాము ఉక్రెయిన్ సేవలపై దాడులు చేయడం లేదని స్పష్టంచేశారు.యూరఫ్ నుంచి అణ్వాయుధాలను అమెరికా ఉపసంహరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లవ్‌రోవ్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌పై తమ యుద్ధం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఆశించిన లక్ష్యం నెరవేరే వరకు తమ దాడులు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ధుల భద్రతపై విదేశాంగశాఖ తీవ్ర ఆందోళనలో ఉంది. భారత్‌లో రష్యా , ఉక్రెయిన్ రాయబారులతో ఈవిషయంపై చర్చించారు విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా . ఖార్కీవ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల విూదుగా స్వదేశం చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.నవీన్ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన తెలియగానే భారీ సంఖ్యలో గ్రామస్తులు నవీన్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు. కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా నవీన్ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు.
గత ఆరు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. వందల సంఖ్యలో సైనికులు, అమాయ పౌరులు మృతి చెందుతున్నారు. యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాన్ని కోరుతున్నాయి. ఈ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో తమ నిర్ణయంలో మార్పు లేదని రష్యా స్పష్టంచేసింది. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు ఉక్రెయిన్‌పై తమ సేనల దాడులు కొనసాగుతాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది..ఉక్రెయిన్‌లోని భార్కివ్‌లో రష్యన్ బలగాలు జరిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న రష్యాపై వరుసగా ఆంక్షల సెగ తగులుతోంది. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టగా.. ప్రస్తుతం క్రీడాలోకంలో కూడా రష్యా ఏకాకిగా మిగిలిపోనుంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై బహిష్కరణ వేటు వేసింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రష్యన్ జట్లను అనుమతించవద్దని ఐఓసీ ప్రకటించింది.ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులతో మరో విమానం రొమేనియా నుండి ఢల్లీికి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తిరిగి వచ్చిన వారిని స్వాగతించారు మరియు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ రక్షించడానికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తోందని వారికి హావిూ ఇచ్చారు.
రొమోనియా ప్రధానితో మోడీ చర్చలు
ఉక్రేయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడి భారత ప్రజలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రొమేనియా ప్రధానమంత్రి నికోలే`ఇయోనెల్ సియుకాతో భేటీ అయ్యారు. వీసాలు లేకుండా రొమేనియా ద్వారా భారతీయ పౌరులను తరలించడానికి వీలు కల్పించినందుకు ప్రధాని మోడీ నికోలే`ఇయోనెల్ సియుకా కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో రొమేనియా అందించిన సహాయం మరువలేనిదన్నారు. వీసాలు లేకుండా రొమేనియాలోకి ప్రవేశించడానికి భారతీయ పౌరులను అనుమతించడం, ప్రత్యేక విమాన సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవడంపై నికోలే`ఇయోనెల్ సియుకాను ప్రధాని మోడీ అభినందించారు. ఈ భేటీలో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింసపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్యం కోసం కాకుండా.. శాంతియుత చర్చలు ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ముఖ్యమని పునరుద్ఘాటించారు. భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు రోమానియాకు ప్రత్యేక ప్రతినిధిగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాను నియమించడంపై కూడా ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా సియుకాతో పలు అంశాలపై ప్రధాని వివరించారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. రష్యా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పాలనను స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఎదురు దాడులు చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై.. పాశ్చాత్య దేశాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే.. అమెరికా, బ్రిటన్ సహా.. పలు దేశాలు రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి.