Ticker

6/recent/ticker-posts

Ad Code

శివన్నామస్మరణతో మారుమోగుతున్న శ్రీగిరులు - శ్రీశైలం

శ్రీశైలం, మార్చి 1 (ఇయ్యాల తెలంగాణ) : భక్తుల సందడితో  శ్రీశైలం కళ కళ లాడుతోంది. శివనామస్మరణతో మార్మోగుతుంది. మల్లన్న దర్శనానికి మూడు లక్షల మంది భక్తులు విచ్చేసారు. మహా శివరాత్రి తెల్లవారుజాము నుంచే   శివన్స్మరణతో శ్రీగిరులు మారు మ్రోగుతున్నాయి. మంగళవారం శ్రీశైలంకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఓవైపు వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తుండగా, మరోవైపు కాలినడకన భారీగా శివ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీశైలంలో భక్తిమార్గం ఉపొంగుతుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది.తమ ఇష్టదైవం లైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలనుదర్శించుకుంటున్నారు. శివ భక్తులు వందలాదిమంది కాలినడకన వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రధాన ఆలయ పరిసరాలు,  దారులన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు చేసి క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ఆన్లైన్‌ లో టికెట్లు పొందిన భక్తులు, ప్రత్యేక కంకణాలతో కాలినడకతో వచ్చే వారితో, దీక్షాపరులతో  దర్శన కూలైన్లు  జనం కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలంలో దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి ఉంటారని ఆలయ అధికారులు అంచనా వేసారు. .   వసతిగృహాల తో పాటు  శ్రీశైలం లో వివిధ ప్రాంతాల్లో ఆలయ అధికారులు టెంట్లు  ఏర్పాటుచేసారు. వాటి కింద భక్తులు సేద తీరుతున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు