యోగీ ఆదిత్యనాథ్ విజయం కోసం “శివాలయం”లో ప్రత్యేక పూజలు
హైదరాబాద్,మార్చి 2 (ఇయ్యాల తెలంగాణ) : యోగీ ఆదిత్యనాథ్ మరో సారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కోరుతూ అత్యంత ధృఢ సంకల్పంతో సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవస్థానం “శివాలయం”లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమంలో బిజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా ఇంఛార్జి ఆకుల విజయ పాల్గొన్నారు. యోగీ ఆదిత్యనాథ్ విజయం కోసం శివరాత్రి పర్వదినాన ఆకుల విజయ శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇటీవల హోరాహోరీగా జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో 90 నియోజక వర్గాలాలో పార్టీ పర్యవేక్షకురాలిగా పర్యటించి ఇటీవలే ఆమె నగరానికి తిరిగివచ్చారు.
“శివరాత్రి” పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళ వారం BJP సనత్ నగర్ కార్యకరలు శ్రీ హనుమాన్ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరో సారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల విజయ మాట్లాడుతూ కుల,మతాలకు అతీతంగా అత్యధిక సంఖ్యాకులు యోగీ ఆదిత్యనాథ్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. యోగీజి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూండాయిజం తగ్గుముఖం పట్టిందని, అభివృద్ధి కూడా పుంజుకున్నదని సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల హర్షం వెలిబుచ్చారు.సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యవహార శైలి పట్ల మరియు ఆయన హయంలో జరిగిన అరాచకాల పట్ల ప్రజలు విసిగివేసారిపోయిన విషయాన్ని ప్రజలు ఈ ఎన్నికలలో ఆ పార్టీని చిత్తుగా ఓడించి బీజేపీ ని 300 పై చిలుకు స్థానాలలో గెలిపించడం ద్వారా తెలియచేయనున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, ఉత్తం కుమార్ రాజ్ పురోహిత్, గిరిజన మోర్చా నాయకుడు చరణ్ సింగ్, సీనియర్ నాయకులు ఆకూరి శ్రీనివాస్ రావు, వై శ్రీనివాస్ రావు, హృషికేశవ, సి వి శ్రీనివాస్, కుశాల్, దశరథ్ గౌడ్, పొలిమేర సంతోష్ కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.