Ticker

6/recent/ticker-posts

Ad Code

Flash News (ఫ్లాష్ న్యూస్) మార్చి 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 ( ఇయ్యాల తెలంగాణ) మార్చి 7వ  తేదీ సోమవారం నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. కాగా., రాష్ట్ర బడ్జెట్‌ కు ఆమోదం తెల్పేందుకు మార్చి  6 వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌ లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించారు. మార్చి   7 వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ ను ప్రవేశపెడతారు.  సభ ఎన్నిరోజులు జరగాలనేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు