హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : పజ్జన్న సేన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజా ప్రతినిధుల బృందంతో కలసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప సభాపతి తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ రాసూరి సునిత మరియు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బుధవారం ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న రాజ్యసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ తెలంగాణ ఎనిమి అని అన్నారు. వేలాదిగా తరలివచ్చిన యువత మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సికింద్రాబాద్ నియోజక వర్గంలో బిజెపి శవ యాత్ర నిర్వహించారు. మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీ తో హోరెత్తిన సికింద్రాబాద్ పెద్ద ఎత్తున తెరాసా నాయకులతో కలిసి నిరసనలు ర్యాలీలు చేయడం జరిగింది. జై తెలంగాణ … జై జై తెలంగాణ… అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నగర సంయుక్త కార్యదర్శి రాజేశ్ గౌడ్ గుండవేణి పాల్గొన్నారు.