హైదరాబాద్,ఫిబ్రవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణా సంక్షేమమే ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశయమని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ పుస్తే శ్రీ కాంత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురాణాపుల్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పుస్తే శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు పధకాన్ని తమ పార్లమెంట్ నియోజకవర్గం లో అర్హులైన వారికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేసీఆర్ అంటు నినాదాలు చేస్తూ జయంతి ఉత్సవాలను సంబరంగా నిర్వహించారు. కార్యక్రమం లో మొగల్ పురా డివిజన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, గోపియాదవ్, గోపిగౌడ్, విష్ణు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.