హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షునిగా ఎస్ చెన్నయ్య పదవి బాధ్యతలు చేపట్టారు.రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షునిగా నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని కుశాల్ టవర్ లో అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ తిరుపతయ్యా సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి దయానందరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఎస్ చెన్నయ్య సమర్దుడని కొనియాడారు. గతంలో చెన్నయ్య అనేక ట్రేడ్ యూనియన్ లలో అలుపెరగని సేవలను అందించి కార్మిక వర్గానికి న్యాయం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రయివేటు సేక్టారుల్లో పని చేస్తున్న కార్మికులకు తగిన వేతనాలు పొందలేక పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కార్మికులు చేయాల్సిన పని గంటల కంటే ఎక్కువ శ్రమ దోపిడీకి గురౌతున్నారన్నారు. ఫలితంగా ట్రేడ్ కార్మికులు అనేక రుగ్మతలకు బలవుతున్నారన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన చెన్నయ్య కి అభినందనలు తెలియజేశారు. అనంతరం మరో అతిధి దళిత సేన సీనియర్ నాయకుడు ధారా శంకరయ్యా మాట్లాడుతూ కార్మిక సమస్యలు పరిష్కరించే సమయంలో ప్రతి ఒక్కరూ చెన్నయ్య కు వేన్నంటి ఉండాలని కోరారు. గతంలో చెన్నయ్య చేసిన కార్మిక సేవలను గుర్తించే రాష్టియ లోక్ జనశక్తి పార్టీ అధినేతలు పశుపతి పాశ్వాన్, రాంజీ లు చెన్నయ్య కు తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షునిగా నియమించారన్నారు. అటు తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఈటీ చారిటేబుల్ ట్రస్ట్ ఫౌండర్ జయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనుభవాలను గడీంచితేనే విజయాలను పొందగలమన్నారు. అనుభవజ్ఞుల సూచనలు పాటిస్తే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు. ఈ సందర్భంగా చెన్నయ్యను అభినందించిన వారిలో బి, శ్యాంసుందర్, ఎస్ మునికుమార్, జిఎన్ నవీన్,వనమల శివ్ చరణ్ జనగమ్ రాజేశ్వరరావు స్టూడెంట్ జాక్, అహ్మద్ మునీర్ లోక్ జనశక్తి పార్టీ సీనియర్ నేత, జి మోహన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.