Ticker

6/recent/ticker-posts

Ad Code

BJP నగర అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా

ధర్నాలో పాల్గొన్న సనత్ నగర్ BJP నాయకులు  

సనత్ నగర్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు హైదర్ నగర్ 123 లో అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యేచన్ సురేష్,  దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, ఉద్యోగాలే ప్రధానాంశాలుగా దశాబ్దాల తరబడి పోరాటం చేసి, ఎంతో మంది బలిదానాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తన కల్లబొల్లి మాటలతో అమాయక తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ రెండవ సారి కూడా అధికార పగ్గాలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగాజారేలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా భావిస్తూ ఉద్యోగ కల్పన అంటే కేవలం తన కుటుంబ సభ్యులకు, తన అడుగులకు మడుగులు వత్తే అస్మదీయులకు పదవుల పందేరాలు చేస్తూ ప్రజా ధనంతో జల్సాలు చేస్తూ సామాన్య ప్రజల ఉసురుపోసుకుంటున్నాడని అన్నారు.  



ప్రాజెక్టుల పేరుతో ఇబ్బడిముబ్బడిగా ప్రజా ధనాన్ని తన అనుచర వర్గానికి అప్పనంగా దోచి పెడుతున్నాడని అన్నారు. “యధారాజా తథా ప్రజా” అన్నట్లు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా తమ హస్తలాఘవం ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని మెక్కుతూ దౌర్జన్యంగా అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రజల మాణప్రాణాలు రక్షించాల్సిన పోలీసు శాఖ కల్వకుంట్ల వారి ఇంటి పాలేర్లుగా మారిపోయి వారికి ఊడిగం చేయడంలో నిమగ్నమై పోయారన్నారు.  అరచేతిలో స్వర్గం చూపి నోటికి వచ్చిన వాగ్దానాలు చేసే కేసీఆర్ ఆ వాగ్దానాలను భంగం చేయడంలో కూడా అంతే సిద్ధహస్తుడన్నారు.  కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగి వేసారి పోయారని వారన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు