Ticker

6/recent/ticker-posts

Ad Code

సనత్ నగర్ లో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు టీకాలు

వాక్సిన్ తో కరోన కట్టడి సాధ్యమవుతుందని నిపుణుల సూచన 


సనత్ నగర్, జనవరి 8 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ పరిరక్షణ కమిటీ, ఈఎస్ఐ & భాజపా సంయక్త అధ్వర్యంలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను అందించారు. సుమారు 100 మంది పిల్లలకు వీరి తల్లి దండ్రుల సంరక్షణలో క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కరోన వైరస్ అతివేగంగా వ్యాపించడంతో పాటు  ప్రస్తుత  “ఓమైక్రాన్” కలవరం ఎక్కువవుతున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ధృడ సంకల్పాన్ని తీసుకోవడం జరిగిందన్నారు.

 “లోధా క్లబ్ హౌస్” లో వాక్సినేషన్ 

 ఈ నేపథ్యంలో సనత్ నగర్ బస్ స్టాండ్ సమీపంలోని లోధా గృహసముదాయం ఎదురుగా గల “లోధా క్లబ్ హౌస్” లో సనత్ నగర్ పరిరక్షణ కమిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్త చొరవతో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ టీకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ సభ్యులు తేజో విజయ్ కుమార్, యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస రావు, రామ రాజు, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, సి వి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు