" శ్రీనివాస శతకము " "విశ్వనాథ పలుకులు" పుస్తక ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : కవి, ఆచార్యులు తల్లోజు శ్రీనివాస్ రచించిన శ్రీనివాస శతకము, విశ్వనాథ పలుకులు అనే రెండు అద్భుత పుస్తక గ్రంథాలను సోమవారం ఆవిష్కరించారు. వాల్మీకి నగర్ శిశుమందిర్ పాఠశాలలలో గ్రంథావిష్కరణ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని కవిత్వానికి, సాహిత్యానికి, పద్యాలకు ఉన్న విశిష్టతను గూర్చి కొనియాడారు.ఇందులో భాగంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సభ అధ్యక్షులు కవి,విమర్శకులు డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్ ముందుగా అందరిని వేదిక మీదకు ఆహ్వానించడంతో కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. కవులు వారి కవిత్వాలు, పద్యాలూ సారాంశాల గూర్చి శ్రీవాటి శ్రీనాథ్ ఏంతో గొప్పగా వర్ణించారు. పుస్తకావిష్కరణ కర్త ముఖ్య అథితి భాజపా పాతనగర సీనియర్ నాయకులు సిహెచ్ రూపరాజ్ మాట్లాడుతూ రచయిత శ్రీనివాస్ ఆచార్యుల దగ్గర చదువు కున్నప్పటికీ ఆయనతో ఉన్న సన్నిహితం పుస్తక రచన దాల్చడం నిజంగా చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. డాక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ పద్యం రాయడమనేది అంత సులువైన విషయం కాదని అదీ కూడా అందరికీ అర్థం అయ్యేలా సరళీ కృతంగా పద్యాలనూ జత కూర్చడం చాలా గొప్ప విషమన్నారు.
శ్రీ సరస్వతీ విద్య పీఠం భాగ్యనగర్ శైక్షణిక ప్రముఖ్ కాసోజు భూషణ్ మాట్లాడుతూ మందమైనటువంటి జనసంద్రానికి అందమైనటువంటి బృందంగా కనిపించేటటువంటి మాటలు ఎన్నో ఉన్నాయని కవికి ఈ విషయాల గూర్చి ఆలోచన చేసి వాటికి రూపం తీసుకురావడం గర్హనీయమన్నారు. కందికల్ గేట్ శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయు లు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మకుటం శ్రీనివాస్ తో పూర్తి చేయడం చాలా ఆనందంగా అనిపించిందని కొనియాడారు. సికింద్రాబాద్ ఎన్నికల విభాగం ప్రతినిధి కె. భుజెందర్ బాబు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా వేచియున్న శ్రీనివాస్ ఆచార్యుల పుస్తకాలు ఆలస్యమైనా ఈ రోజు బయటకు రావడం చాలా ఆనందంగా ఉన్నదని అభివర్ణించారు. శ్రీనివాస శతకము, విశ్వనాథ పలుకులు పుస్తక రచయిత కవి, ఆచార్యులు తల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథావిష్కరనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. పలువురు శిశు మందిర్ పాఠశాల అధ్యాపకులు వీరితో పాటు పూర్వవిద్యార్థులు ఇంకా ఎంతోమంది తనకు అన్ని విషయాల్లో ప్రోత్సహం అందించి పుస్తక ఆవిష్కరణకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదములు తెలిపారు.
కార్యక్రమంలో శిశు మందిర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు కవి శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకినగర్ శిశుమందిర్ పాఠశాల ప్రధాన అధ్యాపకులు సరిత, కందికల్ గేట్ శిశు మందిర్ పాఠశాల ఆచార్యులు సావిత్రి, సునీతా, దుర్గ తో పాటు పూర్వ విద్యార్థులు మనోజ్ యాదవ్, గోపాల్ నాయక్, సురేష్, శివ కాంత్, సతీష్, సందీప్ ప్రదీప్ ఇంకా పెద్ద సంఖ్యలో పూర్వవిద్యార్థులు,ఆచార్యులు కవి శ్రీనివాస్ అభిమానులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.