ముదిరాజ్ ల అభివృద్ధి కై సర్వసభ్య సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాల గురుంచి ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు కావస్తున్నా ముదిరాజ్ ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని పలువురు ముదిరాజ్ కుల పెద్దలు అభిప్రాయపడ్డారు. అందుకే ముదిరాజ్ లంతా కలసి ఒకే తాటిపైకి రావడంతోనే మన సమస్యలు పరిష్కరించుకునే దిశగా కృషి చేయవచ్చని తెలిపారు. అన్ని రంగాల్లో ముదిరాజ్ ల అభివృద్ధి కుంటు పడిందని ముఖ్యంగా దీనికి ముదిరాజ్ లందరు ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. డి నుంచి ఏ మరియు ప్రత్యేక కార్పొరేషన్ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. దీనికి ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ ముదిరాజ్ మరియు చెప్పరీ శంకర్ ముదిరాజ్ మరియు పిట్టల రవీందర్ ముదిరాజ్ పొట్లకాయ వెంకటేష్ ముదిరాజ్ మరియు పుష్పలత ముదిరాజ్ ఎల్ రమణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.