G. O విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాప్తి ఎక్కువ కాకుండా నివారించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్, వేడుకలతో పాటు సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జనం ఒకే దగ్గర ఎక్కువగా గుమికూడా కుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎటువంటి వేడుకలకైనా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మాస్కులు తప్పని సరిగా ధరించాలని, అదే విధంగా భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసింది. అధికారులు రాష్ట్రంలో విధించిన కొత్త ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని తెలిపింది.