Ticker

6/recent/ticker-posts

Ad Code

మత్స్యకారుల సంక్షేమ సంఘం కార్యవర్గం

హైదరాబాద్, డిసెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.  ఇందులో భాగంగా అసెంబ్లీ అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ముదిరాజ్ ప్రధాన కార్యదర్శిగా  కళ్యాణ్ ముదిరాజ్ కోశాధికారిగా  శ్రీధర్ ముదిరాజ్ లను  నియమించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోట పుష్పలత, ఎస్ నాగయ్య ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు