అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకున్న ఉద్యోగులు
హైదరాబాద్, డిసెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 65 వ వర్ధంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో బాబాసాహెబ్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. భాగ్యనగర్ మునిసిపల్ జి.హెచ్.ఎం.సి. ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ వర్ధంతి వేడుకలో సికింద్రాబాద్ జోన్ జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్ బాబాసాహెబ్ డాక్టర్ భీం రావ్ అంబేడ్కర్ స్మృతులను గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాణం కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ పడ్డ తపనను ఆయన గుర్తు చేశారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని పోరాటం చేశారని అన్నారు.
భాగ్యనగర్ మునిసిపల్ జి.హెచ్.ఎం.సి. ఎంప్లాయిస్ యూనియన్ సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు కోడారి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో సికింద్రాబాద్ సర్కిల్ బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమీషనర్లు పి. మోహన్ రెడ్డి, ముకుంద్ రెడ్డి, తో పాటు సికింద్రాబాద్ జోన్ ఎస్ ఈ ఇంజనీర్ అనిల్ రాజ్ అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు భాగ్యనగర్ మునిసిపల్ జి.హెచ్.ఎం.సి. ఎంప్లాయిస్ యూనియన్ సికింద్రాబాద్ జోన్ సలహాదారులు కె. భుజేందర్ బాబు బాబాసాహెబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. బిఎంఎస్ సర్కిల్ సెక్రటరీ లు బాలకృష్ణ,శంకర్, కిషన్ సింగ్,బిఎంఎస్ నాయకులు, కార్యకర్తలు రామేశ్వర్,వెంకటేశ్వర్లు,బాల్ నరేందర్, సుజిత్ కుమార్,పద్మారావు లు భీం రావు చిత్ర పటానికి ఘన నివాళి అందించారు. వీరితో పాటు వివిధ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు బిఎంఎస్ నాయకులు పెద్ద ఎత్తున అంబేడ్కర్ నివాళులు అందించారు. " డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ అమర్ హై " అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై భీం అన్న స్లోగన్లతో సికిందరాబాద్ జోనల్ కార్యాలయం మార్మోగిపోయింది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంతో పాటు మల్కాజ్ గిరి ఇతర జోన్ లకు సంబందించిన అధికారులు,ఉద్యోగులు పెద్ద ఎత్తున అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన CO లు వెంకన్న,పుష్ప,వరుణ,ధనశ్రీ,రాములు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని అంబేడ్కర్ ఆశయాలను గుర్తు చేసుకున్నారు.