హైదరాబాద్,నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియా కోహ్లీ సమాజ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. రైతులు దైవంతో సమానమని వారి వల్లనే మనకి భుక్తి, ముక్తి అన్ని ఉన్నాయన్నారు. మోడీ నిర్ణయం పట్ల మేమంతా ఎంతగానో అభినందిస్తున్నామని తెలిపారు. రైతులు చేసిన ధర్నాలు చరిత్రలో నిలిచిపోయే ధర్నాలని ఎందుకంటే రైతు చట్టాలను రద్దు చేయమని సంవత్సరం పాటు ధర్నా చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని రైతుల కోసం చట్టాలని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఇండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు.