Ticker

6/recent/ticker-posts

Ad Code

గణిత విద్యపై సెమినార్ కు ఆహ్వానం

 గణిత విద్యపై - రాష్ట్ర స్థాయి సెమినార్


హైదరాబాద్, నవంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) :  గణితం ఉపాధ్యాయుల్లో సృజనను వెలికి తీసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్బంగా రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు ప్రతి గణిత ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి సీ .ధర్మేందర్ రావ్ పిలుపునిచ్చారు. ఎస్ సీ ఈ ఆర్ టి సూచించిన పత్రాలను  సమర్పించాలని హైద్రాబాద్  జిల్లా నుంచి ఎక్కువ మంది ఎంపిక అయ్యేలా చూడాలని జిల్లా సైన్స్ అధికారి సీ .ధర్మేందర్ రావ్ కోరారు.

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి , జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం గణిత విద్యపై వివిధ  అంశాలపై ఒకరోజు  సెమినార్ ను ఎస్ సీ ఈ ఆర్ టీ  SCERT నిర్వహిస్తోందన్నారు.గణితం ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించుకోవడం గణిత సంబంధిత అంశాలపై ఆధునిక సాంకేతిక విషయాలను ఉపాధ్యాయులకు తెలియజేయడం, గణితం బోధనల్లో వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయుల్లో ప్రోత్సహించడం ఈ సెమినార్ నిర్వహణ ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. 

 నిర్దేశించిన అంశాలు :

 2020-21 విద్యా  సంవత్సరానికి సంబంధించిన కరోనా మహమ్మారి పరిస్థితుల్లో గణితాన్ని బోధించడంలో అనుసరించిన కొత్త పద్ధతులు 

 గణితంలో బోధన  అభ్యసన ప్రక్రియల్లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా గణితంలో అభ్యసనా అంతరాలను (గ్యాప్స్ ) పరిష్కారం కనుగొనడం  , కోవింద్ కాలంలో వాడిన కొత్త పద్ధతులను అమలు చేస్తూ భవిష్యత్తులో గణితాన్ని బోధనలను  ఉపయోగించడం అనేవి ఉప అంశాలుగా ఉన్నాయి.


 పరిశోధన పత్రాలు  :--

ఈ అంశాలపై గణిత ఉపాధ్యాయులు  టీచర్ ఎడ్యుకేటర్స్  పరిశోధకులు విద్యావేత్తలు , పాఠశాల ఉపాధ్యాయులు , అన్ని రంగాల్లో పనిచేస్తున్నవారు, NGOs  పరిశోధన పత్రాలను తెలుగు , ఆంగ్లంలో పంపించవచ్చు ,  ఆయా అంశాలపై ఇప్పటికే ఇతరులు రాసిన పరిశోధనా పత్రాలను అనుకరించి రాస్తే  ఆమోదించరు. గణితం విద్యకు సంబంధించిన అంశాలు ఉపఅంశాలు వివరాలను డిసెంబర్ 2 వ తేదీ 2021 లోపు tgscertmathsscience@gmail.com కు పంపవలసిందిగా తెలియజేశారు. సెమినార్ పత్రాలను పరిశీలించాక ఉత్తమంగా ఉన్న వాటిని ఎస్ సీ ఈ ఆర్ టీ  ఎంపిక చేస్తుంది. వారికి డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవం రోజు నిర్వహించే సెమినార్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సీ.ధర్మేందర్ రావ్ ను 7799171277 చరవాణిలో సంప్రదించవచ్చు. వివరాలకు 9440405244 , 9550466596 నెంబర్లను సంప్రదించగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు