భాగ్యలక్ష్మి ఆలయంలో తొమ్మిది రోజుల నుంచి పూజలు
హైదరాబాద్, అక్టోబర్ 14 (ఇయ్యాల తెలంగాణ) : శరన్నవాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత తొమ్మిది రోజులుగా అమ్మవారు వివిధ రూపాల్లో కొలువు దీరి కనిపించారు. ఆలయ నిర్వాహకురాలు ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలతో నిత్యం వివిధ రూపాల్లో తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల సదుపాయాలు సమకూర్చారు. పాతనగరంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణను పొందుతున్నారు. బుధవారం ఎనిమిదవ రోజు కావడంతో ఆలయ ప్రాంగణములో ప్రత్యేక హోమం నిర్వహించారు. తొమ్మిదో రోజు కూడా అమ్మవారిని విశిష్ట రూపంలో అలంకరించారు. గత తొమ్మిది రోజులుగా భాగ్యలక్ష్మి అమ్మవారిని వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి భక్తులు దర్శించుకోవడానికి వీలు కల్పిస్తోంది ఆలయ కమిటీ. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు దర్శన సదుపాయాలు కల్పించినట్లు ట్రస్టీ శశికళ తెలిపారు. దసరా ఉత్సవాలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ట్రస్టీ శశికళ పేర్కొన్నారు.