Ticker

6/recent/ticker-posts

Ad Code

విజయ్‌ దేవరకొండ డ్యాన్స్‌ అదుర్స్‌ అంటున్న ఛార్మి


టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబీనేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ’లైగర్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి అనన్య పాండే హీరోయిన్‌. కరణ్‌ జోహార్‌, పూరి జగన్నాథ్‌, చార్మీ, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై విజయ్‌ ఫ్యాన్స్‌కి ఉత్తేజకరమైన అప్‌డేట్‌ ఇచ్చింది చార్మీ. ’లైగర్‌’ షూటింగ్‌కి గురించి తాజాగా సోషల్‌ విూడియాలో షేర్‌ చేసింది చార్మీ. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా పాత్రల్లో కనిపించిన విజయ్‌.. ఇందులో కొత్త అవతారంలో కనిపిస్తాడని ఈ బ్యూటీ తెలిపింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఈ రౌడీ హీరో మునుపెన్నడూ చేయని విధంగా మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఆ పాట చిత్రీకరణలో కుర్ర హీరో ఎనర్జీ చూసి ఈ పోస్ట్‌ పెడుతున్నట్లు పేర్కొంది ఈ భామ. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు