Ticker

6/recent/ticker-posts

Ad Code

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు స్వీకరణ

గర్వంగా ఉందన్న తలైవా

సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన రజనీకాంత్‌ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ’దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుఆయనకు అవార్డును అందజేశారు. సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రజనీకాంత్‌కి ఈ విశిష్ట గౌరవం దక్కడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్‌ అసురన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కాగా, రజనీకాంత్‌ కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు రజనీకాంత్‌. ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్‌  తన నివాసంలో విూడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఇలాంటి శుభతరుణంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది అని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు