Ticker

6/recent/ticker-posts

Ad Code

రామారావు ఆన్‌ డ్యూటీలో మాస్‌ మహారాజ


మాస్‌ మహారాజా రవితేజ తాజా చిత్రం ’రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని యసెల్వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ’మజిలీ’ బ్యూటీ దివ్యాన్ష్‌ కౌశిక్‌, మలయాళ కుట్టి రజిషా విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ను చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ గా వచ్చే ఈ ్గªట్‌ సీన్‌ .. సినిమాకే హైలైట్‌ గా నిలుస్తుందట. కథకి చాలా కీలకమైన ఈ ్గªట్‌ సీన్‌ అద్భుతంగా వస్తోందని చెబుతున్నారు మేకర్స్‌. షూటింగ్‌ మొదలైన రోజు నుంచి ఈ సినిమాపై ఇండస్ట్రీటో చాలా పాటిటివ్‌ బజ్‌ నడుస్తోంది. సిన్సియర్‌ యమ్మార్వోగా రవితేజ 

యాక్టింగ్‌ ఓ లెవెల్‌ లో ఉండబోతుందని అంటున్నారు. ’విక్రమార్కుడు’ తర్వాత రవితేజ కెరీర్‌ లోనే ఈ సినిమా మరో ల్యాండ్‌ మార్క్‌ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు ఖిలాడీ, ధమాకా చిత్రాలు కూడా ఏకకాలంలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ’ఖిలాడి’ తర్వాత విడుదల కానున్న ’రామారావు ఆన్‌ డ్యూటీ’ రవితేజకి ఏ రేంజ్‌ హిట్టవుతుందో చూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు