Ticker

6/recent/ticker-posts

Ad Code

పూరీని అభినందించిన అభిమాని



డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ అతి తక్కువ సమయంలోనే ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. కథానాయకుల పాత్రల్ని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దటంలో ఆయన రూటే సపరేటు. చివరిగా ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మంచి హిట్‌ కొట్టిన పూరీ జగన్నాథ్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా లైగర్‌ అనే సినిమా చేస్తున్నాడు. లైగ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటుంది.అయితే పూరీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో సిగ్నల్‌ దగ్గర కారు ఆగింది. ఆ సమయంలో ప్రమోద్‌ అనే అభిమాని పూరీని చూసి పలకరించాడు. తన దగ్గర ఫోన్‌ లేకపోవడంతో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ సంభాషణ ను నటి ఛార్మి కౌర్‌ రికార్డ్‌ చేయడం జరిగింది. సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తూ, ఈ వీడియో తన కోసమే అంటూ చెప్పుకొచ్చారు. ట్విట్టర్‌లో పెట్టమని ప్రత్యేకంగా కోరడంతో పోస్ట్‌ చేయడం జరిగిందని ఛార్మీ పేర్కొంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు