హైదరాబాద్,అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : పబ్లిక్ రంగ సంస్థలను పూర్తిగా అమ్మే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రాసూరి చంద్రశేఖర్ కేంద్రానికి ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల ప్రంపంచ దళిత సదస్సు ముగింపు దశలో ప్రధాన కార్యదర్శి రాసూరి చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ధామాష ప్రకారం దేశ సంపదను అందరికీ అందేటట్లు చూడాలన్నారు. వందల సంవత్సరాల నుండి అన్ని అవకాశాలు కోల్పోయిన ఎస్సీ ఎస్టీ ల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోని వారి జివితాలను ఉన్నత వర్గాల స్ధాయికి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి బతుకు భరోస కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం అన్యాయానికి గురైనప్పుడు సత్వర న్యాయం జరగడానికి ప్రత్యేకమైన పోలిష్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర హైకోర్టు లో ఎస్సీ ఎస్టీ లకు సత్వర న్యాయం జరగడానికి ప్రత్యేక బేంచ్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాన డిమాండ్ చేశారు. ప్రపంచ దళిత సదస్సు అనే మహాత్తర కార్యానికి కిలక వ్యక్తిగా వ్యవహరించిన జి. మురళీధర్ రావ్ కు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.