అకుంఠిత దీక్ష పరులు లాల్ బహదూర్ శాస్త్రి : BJP నేత KUMAR
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకొని నవతరంగిణి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తాన్ షాహీ ప్లే గ్రౌండ్ లో జయంతి వేడుకలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ రాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి గోల్కొండ ఉపాధ్యక్షులు ఎం. కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన జాతిపిత మహాత్మా, భారత మాజీ ఉప ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడిన మహాత్ముల జీవితాల గురుంచి ఎంత స్మరించు కున్నా తక్కువే అవుతుందని తెలిపారు.
లాల్ బహదూర్ శాస్త్రి అకుంఠిత దీక్ష పరుడని కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉంది కూడా కడు పేదరికాన్ని అనుభవించాడని ఈ సందర్బంగా గుర్తుచేశారు. నీతి, నిజాయితీకి శాస్త్రి నిలువెత్తు నిదర్శనమని ఆయన తన పిల్లలను కూడా చదివించుకోలేని స్థితిలో కూడా దేశ హితం కోసమే పాటు పడ్డారని అలాంటి వారి జీవితాలను ఎంత స్మరించుకున్నా తక్కువే అని పేర్కొన్నారు. అనంతరం అందరు కలసి సమీప ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పి. లక్ష్మణ్, ఏ. శ్రీనివాస్, యూ. రాకేష్ నవ తరంగిణి ప్రధాన కార్యదర్శి కె. నాగరాజ్ కమిటీ సభ్యులు మహేందర్, బి. దాస్, అజయ్ (దీపక్), దేవి సింగ్, సునీల్ తివారి తదితరులు పాల్గొన్నారు.