INSPIRE అవార్డ్స్ మానక్ 2021--22 నామినేషన్ గడువు చివరి తేదీ 15 అక్టోబర్ 2021.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏటా INSPIRE అవార్డ్ మానక్ నిర్వహిస్తున్నారు , ఏటా దేశంలోని 6 నుండి 10 వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్యాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తూ ప్రతిభ చూపిన విద్యార్థుల ప్రదర్శనలకు INSPIRE అవార్డ్ అందిస్తూ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు రూ 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తారు. విద్యార్థులు ఈ 10 వేల రూపాయల నగదు నుండి తమ గైడ్ టీచర్ సహాయంతో సమాజానికి ఉపయోగపడే వినూత్నమైన మోడల్ ను తయారు చేసి జిల్లాస్థాయి ప్రదర్శనలలో పాల్గొనవచ్చును. హైద్రాబాద్ జిల్లాకు చెందిన అన్ని యాజమాన్యాల పాఠశాలల UPS మరియు హైస్కూల్ తప్పక 5గురు విద్యార్థుల ప్రాజెక్టులను నామినేషన్ల రూపంలో తప్పక పంపించాలి. ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్టీచర్లు విద్యార్థుల నామినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి DEO ఆర్ రోహిణి తెలియజేశారు .
ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను INSPIRE అవార్డ్ మానక్ -2021-22 సంవత్సరము నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్టీచర్లు తమ పాఠశాల నుండి 5 గురు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించి వారిని INSPIRE అవార్డ్ మానక్ -2021- 22 సంవత్సరం ప్రోత్సహించవలసినదిగా ఆదేశాలను ఇవ్వడం జరిగినది కావున ప్రతి మండలంలోని ఉప విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో పాఠశాలలు అక్టోబర్ తేదీ 15 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్. రోహిణి తెలిపారు.
జిల్లా సైన్స్ అధికారి సీ . ధర్మేందర్ రావ్ :
(1) గైడ్టీచర్లు తమ పాఠశాలలో 6 నుండి 10 వ తరగతి చదువుతున్న ప్రతిభ ఉన్న 5గురు విద్యార్థులకు తమ పాఠశాలకు దగ్గర్లో వున్న పోస్టాఫీసుల్లో పోస్టల్ బ్యాంకు అకౌంట్ను ఉచితంగా తీసుకోవచ్చు.
(2) INSPIRE అవార్డ్స్ మానక్ -2021-22 సంవత్సరం విద్యార్థుల పేర్లు నమోదు చేసేటప్పుడు పోస్టల్ బ్యాంక్ అక్కౌంట్ లో ఉన్న పేరు లేదా బ్యాంక్ అకౌంట్ పై ఉన్న విద్యార్థి పేరుతో నమోదు చేయాలి .