Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆయేషాతో ముగిసిన ధవన్‌ వైవాహిక జీవితం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ):  టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తన ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. ఈ విషయాన్ని ధవన్‌ భార్య, 46 ఏళ్ల ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. భారత సంతతికి చెందిన మెల్‌బోర్న్‌ బాక్సర్‌ ఆయేషాను 35 ఏళ్ల ధవన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. ధవన్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆయేషాకు అంతకుముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని ధవన్‌ పెళ్లి సమయంలో దత్తత తీసుకోవడం తెలిసిందే. ఇక ధవన్‌`ఆయేషా జోడీకి 2014లో ఒక మగబిడ్డ పుట్టాడు. అతడి పేరు జోరావర్‌ ధవన్‌.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు