Ticker

6/recent/ticker-posts

Ad Code

హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలి

పిటిషన్‌పై సుప్రీం కోర్టు నిస్సహాయత


న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ): హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌పై తాము ఏవిూ చేయలేమని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని.. మనకు జాతీయ జంతువు ఉన్నప్పుడు జాతీయ క్రీడ ఎందుకు ఉండకూడదని పిల్‌ వేసిన న్యాయవాది విశాల్‌ తివారీ ధర్మాసనం ముందు తన వాదన వినిపించారు. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని  పిటిషనర్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే తామే రద్దు చేస్తామని జస్టిస్‌ లలిత్‌ వ్యాఖ్యానించారు. దీంతో న్యాయవాది విశాల్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు