Ticker

6/recent/ticker-posts

Ad Code

తండ్రి అయిన క్రికెటర్‌ ఫించ్‌

సోషల్‌ విూడియా వేదికగా శుభవార్త వెల్లడి



 సిడ్నీ,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ): ఆస్టేల్రియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ తండ్రయ్యాడు. మంగళవారం ఫించ్‌ సతీమణి అవిూ ఫించ్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్న పాపకు ఎస్తేర్‌ కేట్‌ ఫించ్‌గా నామకరణం చేశారు. సోషల్‌ విూడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్న ఫించ్‌.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడిరచాడు. విషయం తెలుసుకున్న సహచరులు, సన్నిహితులు ఫించ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఫాన్స్‌ కంగ్రాట్స్‌ చెపుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తతం ఆసీస్‌ టి20, వన్డే జట్టుకు ఫించ్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ’ఎస్తేర్‌ కేట్‌ ఫించ్‌.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అవిూ ఫించ్‌, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడికి నా కృతజ్ఞతలు’ అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్‌ ఫించ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌విూడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు