Ticker

6/recent/ticker-posts

Ad Code

మహాసముద్రంలో మరో లిరికల్‌ సాంగ్‌ విడుదల

శర్వానంద్‌,సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి రూపొందిస్తున్న ’మహా సముద్రం’ మొదటి లిరికల్‌ సాంగ్‌ను రష్మిక మందన్నా విడుదల చేశారు. ’చెప్పకే చెప్పకే’ అంటూ సాగే పాటకు ఫిదా అయ్యానని ఆమె ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరకల్పనలో చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించిన ఈ పాటను దీప్తి పార్థసారధి పాడారు. ’ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌సాంగ్‌ నాకెంతో నచ్చింది. చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌. శర్వా ఇటీవల నాకు ట్రైలర్‌  చూపించారు. అందరూ అదరగొట్టేశారు’ అని రష్మిక అన్నారు. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీతో  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిలు. శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా ’ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ’మహాసముద్రం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘హే రంభ‘ పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 


తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ విడుదల అయ్యింది. ’చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. అంటూ సాగే ఈ సాంగ్‌ను హీరోయిన్‌ రష్మిక విడుదల చేసింది. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు