Ticker

6/recent/ticker-posts

Ad Code

గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సమంత

ఇండస్ట్రీలో  దాదాపు పది సంవత్సరాల పాటు పని చేసిన కారణంగా కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటానని సమంత ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత త్వరలో విఘ్నేష్‌ శివన్‌ మూవీ షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేయనుంది. అయితే ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో గోవాలో ఎంజాయ్‌ చేస్తోంది.  తన ఫ్రెండ్‌ శిల్పా రెడ్డితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్‌ చేస్తోంది. గోవా అందాలను ఆస్వాదిస్తున్న సమంత ఎప్పటికప్పుడు తన సోషల్‌ విూడియాలో షేర్‌ చేస్తుంది. రీసెంట్‌గా సైక్లింగ్‌ కి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేయగా, ఇప్పుడు కయాకింగ్‌ చేస్తుంది. నదిలో ఆమె తెడ్డు వేసి బోట్‌ నడుపుతూ సంతోషంగా కనిపిస్తోంది. గోవా అంటూ సమంత, చైతూకి చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే.త్వరలో వారు అక్కడ ఫాం హౌజ్‌ కూడా నిర్మించుకోనున్నారనే ప్రచారం కూడా సాగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు