హైదరాబాద్,సెప్టెంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత డల్లు సత్యనారాయణ 79 వ జయంతి సందర్భంగా డల్లు యువసేన ఆధ్వర్యంలో ఈ రోజు పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కసరట్ట లోని గవ్నమెంట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. డల్లు యువసేన నిర్వాహకుడు డల్లు సత్యనారాయణ తనయుడు డల్లు శివ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా డల్లు శివ మాట్లాడుతూ మా నాన్న గారైన డల్లు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అహర్నిశలు పాటుపడ్డారని పేద ప్రజల జీవన స్థితిగతుల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి విద్య, ఉపాధి కోసం కృషి చేసే వారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు సహకారం సమాజానికి అందిస్తానని డల్లు శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.