అంతా ఒక్కటే అంటూ బజారున పడ్డ తారలు
అక్టోబర్ పదో తేదిన జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల అధికారిగా అడ్వకేట్ కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను అధికారిగా నియమిస్తూ ప్రస్తుత ’మా’ అధ్యక్షుడు నరేశ్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజు భారత్‌లో ఉండడం లేదు. ఆయన విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుత మా అధ్యక్షుడు. బైలాస్ ప్రకారం ఎన్నికల అధికారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అధికారిని నియమించి, నోటిఫికేషన్ విడుదలయ్యాక ’మా’కు సంబంధించిన రోజువారీ వ్యవహారాలు, ఎన్నికల పక్రియకు సంబంధించిన పూర్తి బాధ్యత ఎన్నికల అధికారిదే. జీవీ నారాయణరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణెళిశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ కామెంట్ చేయడం, ఆ వెంటనే జీవితా రాజశేఖర్ దీనికి కౌంటర్ బదులివ్వడం తెలిసిందే. మొదటి నుంచి మా ఎన్నికల విషయంలో సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శులు చేసుకుంటున్నారు. మేమంతా ఒకే ఫ్యామిలీ అంటూనే బహిరంగ విమర్శలకు దిగుతుండటం టాలీవుడ్‌ను బజారున పడేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలతో ప్రతిష్ట మసకబారుతుందని గుసగుసలు గుసగుసలు వినిపిస్తున్నాయి.