Ticker

6/recent/ticker-posts

Ad Code

కలెక్టర్‌ వాహనానికి పోలీస్‌ చలానా

జనగామ,సెప్టెంబర్‌7(ఇయ్యాల తెలంగాణ):  అతి వేగంగా ప్రయాణించినందుకు కలెక్టర్‌ వాహనానికి కూడా పోలీసులు చలాన్లు విధించారు. ఏకంగా జనగామ జిల్లా కలెక్టర్‌ ప్రయాణించే అధికారిక వాహనంపై 23 చలాన్లు విధించారు. కలెక్టర్‌ వినియోగించే  కారు అతివేగంతో ప్రయాణించినందుకు 23 చలాన్లను పోలీసులు విధించారు. 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు 30 వరకు ఈ చలాన్లను విధించారు. ఈ వాహనంపై రూ. 22,905మ విలువ గల చలాన్లు పెండిరగ్‌లో ఉన్నాయి. తమకు కలెక్టర్‌ అయినా, సామాన్యులైనా సమానులేనని పోలీసులు భావించి చలాన్లు విధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు