Ticker

6/recent/ticker-posts

Ad Code

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో మరోమారు టీమిండియా టూర్‌

వన్డే పోటీలను ఖరారు చేస్తూ  షెడ్యూల్‌


లండన్‌,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ):  ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జులైలో మరోసారి అక్కడ పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. 2022లో ఇంగ్లండ్‌లో ఇంటర్నేషనల్‌ కేలండర్‌ను ప్రకటించిన అక్కడి క్రికెట్‌ బోర్డు.. టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. నిజానికి ప్రతి టూర్‌లోనూ టెస్ట్‌లతోపాటు వన్డే, టీ20 సిరీస్‌ కూడా జరగాల్సి ఉన్నా.. ఈసారి కొవిడ్‌ కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తర్వాత నిర్వహిస్తున్నారు. వచ్చే జులై 1న ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో టీ20 మ్యాచ్‌తో టీమిండియా టూర్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జులై 3న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో రెండో టీ20, జులై 6న ఎజియస్‌ బౌల్‌లో మూడో టీ20 జరుగుతుంది. ఇక జులై 9 ఎడ్‌బాస్టన్‌లో తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత జులై 12న ఓవల్‌లో రెండు, జులై 14న లార్డ్స్‌లో మూడో వన్డే జరుగుతాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు