పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజిద్దాం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) : కరోనా నేపథ్యంలో మట్టి గణపతిని పూజించి, నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మంచిదని తెలంగాణ ఉప సభాపతి (స్పీకర్) తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల స్థానిక ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.సుమారు 100 మందికి పైగా ఆయన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయకుణ్ణి పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరమని ఈ సందర్బంగా గుర్తుచేశారు. వాటిని నిమజ్జనం చేయడం కూడా తేలికగా జరిగిపోతుందని తెలిపారు. మట్టి గణేశున్ని పూజించి నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని ఉప సభాపతి కోరారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు స్పీకర్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. గణేశుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి ఈ భూభాగం నుండి పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ లంబోదరుడి ని పూజిస్తున్నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకుడు తీగుళ్ల కిషోర్ గౌడ్ , G.రాజేష్ గౌడ్ పెద్దన్న, Dr. గంగాధర్, ప్రవీణ్ గౌడ్ ,A.ప్రకాష్, రాజేశ్ తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.