Ticker

6/recent/ticker-posts

Ad Code

కూతరు పాత్రలో నటించిన కృతిశెట్టితో రోమాన్సా ?


నో చెప్పిసిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి



తనకు కూతురిగా నటించిన కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. వైష్ణవ్‌ తేజ్‌,కృతిశెట్టి జంటగా నటించగా సూపర్‌హిట్‌ అయిన ’ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి కృతిశెట్టికి తండ్రిగా రాయణం పాత్ర పోషించిన సంగతి తెలిసిందే!  తాజాగా ఆయన నటించిన లాభం’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమాలో తనకు జోడీగా కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. ఉప్పెన’ చిత్రంలో బేబమ్మ పాత్రకు తండిగ్రా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఆ సినిమా తర్వాత తమిళంలో చేయబోయే చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టిని సెలెక్ట్‌ చేస్తే బావుంటుందని దర్శకనిర్మాతలు భావించి ఆమె ఫొటో పంపారు. వెంటనే వారికి కాల్‌ చేసి  ఇటీవల ఓ సినిమాలో ఆమెకు తండ్రి నటించాను. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్‌ చేయలేను.  తనని నా పక్కన హీరోయిన్‌గా ఊహించుకోలేనని చెప్పా. 

ఉప్పెన’ ª`లకైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎమోషనల్‌ సీన్స్‌ చేయడానికి కాస్త కంగారు పడిరది. ’బేబమ్మ.. నాకు నీ వయసు కొడుగు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి. భయపడకు కంగారు లేకుండా ధైర్యంగా చెయ్య’ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన కృతీతో జోడీ కట్టడం నా వల్ల కాదు‘ అని విజయ్‌ సేతుపతి వివరించారు. ఆయన నటించిన ’లాభం’ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు